వర్షాభావం, తీవ్రమైన ఎండలు, ఎల్‌నినో ప్రభావం వల్ల నారుమళ్లు జీవం కోల్పోతుండటంతో అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన 60 సంవత్సరాల వ్యవసాయ అనుభవంలో శాస్త్రవేత్తలు నమ్మకంతో పరిశీలన నిమిత్తం ఇచ్చిన నూతన వరి వంగడాల వివరాలను ఇప్పుడు ఎలా తెలియజేయాలో అర్థం కావడంలేదని వాపోయారు. రాగోలు వరి పరిశోధనా స్థానం వారు ఆర్‌జీఎల్ 7038, ఆర్‌జీఎల్ 7045, ఆర్‌జిఎల్ 7062 నూతన వంగడాలను చిరుసంచుల ద్వారా అందించారు. జులైలో 40 శాతం వర్షాభావం వల్ల నారసింహ చెరువులో నీరు లేక నారుమళ్లు ఎండిపోతున్నాయి. జలవనరుల శాఖ సాగునీరు అందించలేకపోతే లిఖితపూర్వకంగా ఇచ్చి క్రాప్ హాలీడేగా ప్రకటించాలని, కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు.
0 Comments