పాలకొండ వెబ్ న్యూస్, 28 జులై 2026:పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 500 మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు యూనిట్ పరీక్షల నిమిత్తం ఉచిత 'సంకల్ప' స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటివరకు పూర్తయిన సిలబస్‌కు అనుగుణంగా రెండు, నాలుగు మరియు ఎనిమిది మార్కుల ప్రశ్నలు, సమాధానాలతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ మెటీరియల్‌ను రూపొందించారు.
ఈ సందర్భంగా మన్యం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వేమూరి హరగోపాల్ మాట్లాడుతూ.. ఈ మెటీరియల్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా చదువులో వెనుకబడిన వారికి సహాయకారిగా ఉంటుందని తెలిపారు. జిల్లాలోని 14 జూనియర్ కళాశాలలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణతే లక్ష్యంగా ఈ మెటీరియల్ అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ పైల శంకరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి వెలమల అప్పారావు, చంద్రరావు, రవికుమార్, శివానందరావు, శ్రీరామ్మూర్తి, శ్రీనివాసరావు, శోభారాణి తదితరులు పాల్గొన్నారు
0 Comments