మై డిస్ట్రిక్ట్ టేక్స్ ఆఫ్ - ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అనే అంశంపై నిర్వహించిన మండల స్థాయి చిత్రాలేఖన పోటీలలో ప్రధమ బహుమతి సాధించి, గురువారం జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనబోతున్న మండల పరిషద్ ప్రాథమికోన్నత పాఠశాల పి. వి. ఆర్ పురం విద్యార్థిని బౌరోతు షణ్ముఖ ప్రియను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరడాన సంపత్ కుమార్ మరియు ఉపాధ్యాయ సిబ్బంది పద్మావతి, జనర్ధణరావు, సరస్వతి, సురేష్, లక్ష్మిలు ఘనంగా మెమెంటోతో అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో పోటీ తత్త్వం పెంచి, భవిష్యత్తులో సమస్యల సాధనలో మెరుగైన ఫలితాలు కలిగిస్తాయని తెలిపారు. గత సంవత్సరం కూడా ఈ పాఠశాల విద్యార్థులు మండల స్థాయి వకృత్వ పోటీలలో మొదటి బహుమతి, జిల్లా విజ్ఞానిక ప్రదర్శనలో రెండు ప్రధమ మరియు ఒక ద్వితీయ స్థానం పొందినట్లు గుర్తుచేస్తూ, భవిష్యత్తులో కూడా కష్టపడి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లితండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు.
0 Comments