తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు

పాలకొండ వెబ్ న్యూస్..ఆగస్టు 1: ​ఐసిడిఎస్ ప్రాజెక్టు పాలకొండ లో ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లి పాలవారోత్సవాలు కార్యక్రమం జరుపు కుంటున్నారు. ఇందులో భాగంగా తల్లులకు, గర్భిణులకు అవగాహన కల్పించారు. పిల్లలకు తల్లి పాలు ఆవశ్యకత, పుట్టిన గంటలోపే మురిపాలు పట్టించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు లబ్ధిదారులకు వివరించారు. బిడ్డలలో ఎదుగుదల పై ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రతీ అంగన్వాడీ కార్యకర్త లబ్ది దారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారు సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అని సీడీ పీఓ రంగలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీ పీఓ రంగలక్ష్మి, సూపర్వైజరలు దశరత్నం, విస్సమ్మ, లావణ్య, జ్ఞానమ్మ, రాజేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు, లబ్ధి దారులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments