నేత్రపర్వతంగా 'శాకంబరీ దేవి' అలంకరణ.. భక్తుల పారవశ్యం!

పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ పట్టణంలోని ఆంజనేయ నగర్‌లో వేంచేసియున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలలో భాగంగా అమ్మవారు 'శాకంబరీ దేవి'గా దర్శనమిచ్చారు. పలు రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని అత్యంత శోభాయమానంగా అలంకరించారు.

​ప్రత్యేక పూజలు – కుంకుమార్చనలు:

​ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని సాయంత్రం వేళ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సహస్ర నామార్చనలు మరియు విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అంజి బాబు గారి వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి.

​కిక్కిరిసిన ఆలయాంగణం:

​శాకంబరీ అవతారంలో దర్శనమిచ్చిన జగజ్జననిని దర్శించుకునేందుకు పాలకొండ పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఆలయాంగణమంతా భక్తుల నామస్మరణతో మారుమోగింది. పూజా నంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు

Post a Comment

0 Comments