పాలకొండ వెబ్ న్యూస్ : తోటపల్లి ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేసి 30 రోజులు దాటినా రుద్రిపేట నరసింహ చెరువుకు సాగునీరు అందడం లేదని అభ్యుదయ రైతు, జిల్లా సమన్వయ కమిటీ సభ్యుడు ఖండాపు ప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం పాలకొండ తహసీల్దార్‌కు రైతులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ చెరువు పరిధిలోని నాలుగు మదుముల ద్వారా పాలకొండ, రుద్రిపేట, గరుగుబిల్లి, లుంబూరు గ్రామాల పరిధిలోని 2 వేల ఎకరాలకు నీరందక నారుమళ్లు ఎండిపోయాయని తెలిపారు. ఎగువ ప్రాంతాలైన సింగపురం, భాసూరు గ్రామాలకు నీరందినా, దిగువ ప్రాంత రైతులను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వర్షాలు పడినా చెరువుకు నీరు చేరక పొలాలు బీడుగా మారాయని, ఆగస్టు ఆఖరుకు నీరిచ్చినా పెట్టుబడులు దక్కవని పేర్కొన్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పాలకొండను కరువు మండలంగా ప్రకటించాలని, ఈ సమస్యపై వ్యవసాయ శాఖ అధికారులు తో సబ్ కలెక్టర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
0 Comments