పాలకొండ వెబ్ న్యూస్, ఆగస్టు 5, 2026:పాలకొండ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు అనారోగ్య కారణముగా, అత్యవసరంగా జరిగిన వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధి నుండి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అందజేశారు. నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో ఈ చెక్కును అందజేయడం జరిగింది. వీరఘట్టం మండలం దసుమంతపురం గ్రామానికి చెందిన పెద్దింటి కాశీ విశ్వనాధంకు 95,306 రూపాయల విలువగల చెక్కును ఎమ్మెల్యే అందజేశారని నియోజకవర్గ శాసనసభ్యుల క్యాంప్ కార్యాలయం ప్రకటనలో తెలిపింది.
0 Comments