పాలకొండ వెబ్ న్యూస్, 20 ఆగస్టు 2026:పాలకొండ పట్టణంలోని దేవరపేట వీధిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ నాయకులు గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పడాల భూదేవి ఆదేశాల మేరకు “కూటమి రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం జరిగింది.
టౌన్ టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి పల్లా కొండబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలను తెలియజేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు డైరెక్టర్, టీడీపీ మండల అధ్యక్షుడు గండి రామినాయుడు, నగర పంచాయతీ మాజీ చైర్‌పర్సన్ ప్రతినిధి ఆకుల కుమార్, నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి సారిపల్లి సంతోష్‌కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి దుమ్ముద దుర్గారావు, పట్టణ కార్యదర్శులు రాంబోతు గోవిందరావు, జన్నెల మురళీమోహనరావు, పట్టణ వైస్‌ప్రెసిడెంట్ దుప్పాడ నారాయణరావు, పట్టణ ట్రెజరర్ తైలాపు సూర్యారావు, దుర్గాప్రసాద్, ఎన్ని వెంకటనాయుడు, బోని అప్పారావు, సింహాచలం పాల్గొన్నారు.
0 Comments