కూటమి ప్రభుత్వ సంక్షేమం ప్రతి ఇంటికీ చేరవేతే లక్ష్యం: గుమ్మడి సింహాద్రి

పాలకొండ వెబ్ న్యూస్, 06 ఆగస్టు 2026:

​పాలకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి పడాల భూదేవి ఆదేశాల మేరకు "కూటమి రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" కార్యక్రమంలో భాగంగా గురువారం పాలకొండ పట్టణంలోని 9వ వార్డు నాగవంశం వీధి, 14వ వార్డు బెల్లంకి వీధిలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జి పల్లా కొండబాబు, పట్టణ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు.

​ఈ సందర్భంగా గుమ్మడి సింహాద్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రతి ఇంటికీ చేరవే యడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు ఇన్‌చార్జి హనుమంతు తమ్మారావు , తెలుగు యువ నాయకుడు చొంగ శివానంద్, మాజీ ఆలయ చైర్మన్ శాసపు సర్వారావు, పట్టణ కార్యదర్శులు రాంబోతు గోవిందరావు, జన్నెల మురళీమోహనరావు, ఎన్.కే. రాజపురం టీడీపీ నాయకుడు నీలాపు సూర్యనారాయణ, 6వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రతినిధి అడపా బాబ్జి, 1వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రతినిధి పడాల రాంబాబు, నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సారిపల్లి సంతోష్ కుమార్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బెజ్జిపురం దేవేందర్, బీజేపీ టౌన్ అధ్యక్షుడు ముంజేటి ఉమామేశ్వరరావు, బీజేపీ నాయకుడు ముద్దాడ చక్రవర్తి, పట్టణ వైస్ ప్రెసిడెంట్ దుప్పాడ నారాయణరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి దుమ్ముడు దుర్గారావు, టౌన్ ట్రెజరర్ తైలాపు సూర్యారావు, పొట్లి మాజీ సర్పంచ్ కర్నెన ప్రతినిధి పామోటి పెంటమ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments