విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ గిరిజన సంక్షేమ కమిటీ సమీక్ష సమావేశంలో పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, రహదారులు, మౌలిక వసతులు మరియు గిరిజనుల జీవన ప్రమాణాల మెరుగుదలకు సంబంధించిన అంశాలపై అధికారులతో విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి గిరిజన కుటుంబానికి సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనులను వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని సమావేశంలో సూచించారు.
0 Comments