పాలకొండ వెబ్ న్యూస్, 27 సెప్టెంబర్ 2026: శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం వద్ద దసరా నవరాత్రుల ఉత్సవములు 11.10.2026 నుండి 20.10.2026 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయు నిమిత్తం ప్రతి సంవత్సరం మాదిరిగా ప్రస్తుత సంవత్సరం కూడా తేది 28.09.2026 ది సోమవారం ఉదయం 08.00 గంటలకు అమ్మవారికి తెర వేయబడుతుంది. తిరిగి తేది 11.10.2026 ది ఆదివారం ఉదయము 08.00 గంటల నుండి నిజరూప దర్శనంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి. వి. సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు.
0 Comments