పాలకొండ ఆర్ సి ఎం చర్చిలో పునీత విన్సెంట్ డి పాల్ పండగ వేడుకలు

పాలకొండ వెబ్ న్యూస్, 28 సెప్టెంబర్ 2026: పాలకొండ ఆర్ సి ఎం చర్చి నందు పునీత విన్సెంట్ డి పాల్ పండగ సందర్భంగా దివ్య బలి పూజ నిర్వహించడమైనది. ఈ పూజలో రెవ ఫా పి సుందర్ రావు పాల్గొని పునీత విన్సెంట్ డి పాల్ గురించి చెబుతూ, ఈయన జీవితము మనందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని పేర్కొన్నారు. రోగులను సందర్శించడం మరియు పేదలకి సహాయం చేయడము ఇతని ద్వారా మనందరం నేర్చుకోవాలని, ప్రతి సంవత్సరము సెప్టెంబర్ నెలలో ఈ పండుగను కొనియాడుదాం అని వివరించడం జరిగింది. ఈ పండగలో పాలకొండ విన్సెంట్ డి పాల్ సొసైటీ ప్రెసిడెంట్ వడ్డే అప్పారావు మాస్టర్, జిల్లా ప్రెసిడెంట్ తిరుపతిరావు మరియు సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments