ఎల్ నినో ప్రభావంతో 2027-28 క్రషింగ్ సీజన్లో ఫ్యాక్టరీని మూసివేస్తామని యాజమాన్యం ప్రకటించింది. దీంతో తీవ్ర నష్టం జరుగుతుందని సంకిలి షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధి బృందం శుక్రవారం ఎమ్మెల్యేను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసింది.
ఈ సందర్భంగా ఏపీ చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చింత సంగం నాయుడు మాట్లాడుతూ.. యాజమాన్యం ప్రోత్సాహకాలు నిలిపివేయడంతోనే సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. ఫ్యాక్టరీని యథావిధిగా నడిపించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతినిధులు నిష్టల సూర్య ప్రకాష్ భుక్తా, మజ్జి దుర్గారావు, నాగరాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
0 Comments