పాలకొండలో వీధి కుక్కల కలకలం: చిన్నారిపై దాడి.. చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు వినతి

పాలకొండ వెబ్ న్యూస్ తేదీ: 05-09-2026
పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని సాయి దుర్గా నగర్‌లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బుధవారం (సెప్టెంబర్ 2) ఉదయం 7 గంటల సమయంలో ఆడుకుంటున్న చిన్నారిపై సుమారు 8 వీధి కుక్కలు ఒకేసారి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే పెద్దలపై కూడా కుక్కలు గుంపులుగా దాడి చేస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సమస్యపై శనివారం (సెప్టెంబర్ 5) నివాసితులు మున్సిపల్ కమిషనర్‌ నూకరాజుకు వినతిపత్రం సమర్పించారు. సాయి దుర్గా నగర్‌లో కుళాయిల ద్వారా తాగునీరు తక్కువగా వస్తుండటంతో తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని కోరారు. కమిషనర్ నూకరాజు మాట్లాడుతూ వీధి కుక్కల సమస్య, తాగునీటి సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పి. గంగాధరరావు, సత్యనారాయణ, బంకి రఘు, కే. కే. రావు, దాడి కోటేశ్వరరావు, బి. శివశంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments