కుమిలి దిలీప్ కుమార్ మాష్టారుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

పాలకొండ వెబ్ న్యూస్, 5 సెప్టెంబర్ 2026: ​పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం జగ్గడుగూడ గ్రామంలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న కుమిలి దిలీప్ కుమార్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన ప్రవృత్తిరీత్యా సామాజిక సేవకుడు. పని చేసిన ప్రతి చోట పేద పిల్లలను సొంత డబ్బులతో చదివించటం, విద్యా పరికరాలు అందించటం చేస్తుంటారు. గత 23 ఏళ్లుగా నిరుపేదలకు వస్త్రదానం, వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాల్లో అన్నదానం, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సహాయం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ అంకితభావానికి, సేవలకు గుర్తింపుగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతులమీదుగా అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డును తన మిత్రులు రాగాల శ్రీనివాస్, పట్నాయకుని శివప్రసాద్ మరియు తన కుటుంబ సభ్యులకు అంకితమిస్తున్నట్లు దిలీప్ కుమార్ తెలిపారు.

Post a Comment

0 Comments