పినాకిల్ సంస్థకు ఆర్టీసీని అమ్మవద్దు: సిఐటియు

పాలకొండ వెబ్ న్యూస్ - 13-09-2026

​విద్యుత్తు బస్సుల సాకుతో ఏపీఎస్ ఆర్టీసీని పినాకిల్ అనే ప్రైవేటు సంస్థకు అమ్మవద్దని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు డిమాండ్ చేశారు. ఆదివారం పాలకొండ ఆర్టీసీ డిపో కాంప్లెక్స్ లో కరపత్రాల పంపిణీ నిర్వహించారు. 75 సంవత్సరాల నుండి ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర సబ్సిడీతో ప్రైవేటు సంస్థ ఒప్పందాల భారాన్ని ప్రజలపై మోపడం సరికాదన్నారు. ప్రభుత్వమే విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని, 4000 కొత్త బస్సులను ప్రవేశపెట్టి 12 వేల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కాదా రాము, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments