పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడినే పూజిద్దాం: ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్

​

పాలకొండ వెబ్ న్యూస్ - 13-09-2026

​పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఏఎంజీ ఫంక్షన్ హాల్ ఆవరణలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.

Post a Comment

0 Comments