పాలకొండ వెబ్ న్యూస్, సెప్టెంబర్ 6: స్థానిక శాఖా గ్రంథాలయం పాలకొండలో జాతీయ పుస్తక పఠన దినోత్సవం సెప్టెంబర్ 6వ తేదీన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 1104 పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు, పాలకొండ లైన్ ఇన్స్పెక్టర్ బత్తిన జీవరత్నం మాట్లాడుతూ పుస్తకం చదవడం వలన అంతం లేని జ్ఞానం, సృజనాత్మకత, ఊహాశక్తి పెరుగుతూ ఉంటాయని తెలిపారు. మానసిక ప్రశాంతత పొందడానికి, నిత్య జీవితంలో ఒత్తిడిని తగ్గించు కోవడానికి పుస్తక పఠనం ఎంతో దోహదపడుతుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ మండల వెంకట రమణ, ఇంచార్జి గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబు, పాఠకులు, సహాయకురాలు కళ్యాణి పాల్గొన్నారు
0 Comments