స్థానిక సంస్థల ఎన్నికల్లో శతశాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: ఆరిమిల్లి రాధాకృష్ణ

పాలకొండ వెబ్ న్యూస్, 29 సెప్టెంబరు 2026:
స్థానిక సంస్థల ఎన్నికల్లో శతశాతం గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తణుకు ఎమ్మెల్యే, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. పాలకొండలోని ప్రైవేట్ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్డు నుంచి గ్రామస్థాయి వరకు టీడీపీ జెండాను రెపరెపలాడించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు దాడి రత్నాకర్, కావలి గ్రీష్మ మాట్లాడుతూ నాయకులు అంతా సమన్వయం తో పార్టీ గెలుపునకు కృషి చేయాలి అని తెలిపారు.ఈ సమావేశంలో నాయకులు పడాల భూదేవి, తేజోవతి, కర్నెన అప్పలనాయుడు, పల్లా కొండలరావు, గండి రామినాయుడు, గంటా సంతోష్‌కుమార్, గుమ్మిడి సింహాద్రి, జాడ శ్రీధర్, ఖండాపు వేంకటరమణ, సవర తోట ముఖిలింగం పాల్గొన్నారు.  

Post a Comment

0 Comments