పాలకొండలో నూతన అగ్నిమాపక కేంద్రం, వాహనం ప్రారంభించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

​

పాలకొండ వెబ్ న్యూస్, తేది: 28-09-2026

​పాలకొండ నగర పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని, అగ్నిమాపక వాహనాన్ని సోమవారం ఉదయం 9:30 గంటలకు పాలకొండ శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ స్థానికంగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర హోం మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, అత్యవసర సేవలు అందించేందుకు వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. నూతన అగ్నిమాపక కేంద్రం, వాహనం అందుబాటులోకి రావడంతో పాలకొండ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందనున్నాయి. అనంతరం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments