అమర నాగలింగేశ్వర స్వామి ఆలయ అంబికా దేవి అమ్మవారి దివ్య కిరీటానికి రూ. 1,50,000 విరాళం

పాలకొండ వెబ్ న్యూస్, అక్టోబర్ 11, 2026:

​పాలకొండ మండలం అంపిలి గ్రామ పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన అమర నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన అన్నపూర్ణాంబ సమేత అంబికా దేవి అమ్మవారి దివ్య కిరీటం తయారీ మరియు సమర్పణ కోసం అంపిలి గ్రామ మహిళలు, గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో రూ. 1,50,000/- (ఒక్క లక్ష యాభై వేల రూపాయలు) విరాళంగా సమర్పించారు. గ్రామ ఐక్యతకు నిదర్శనంగా నిలిచి, అమ్మవారి పవిత్ర సేవలో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికీ అన్నపూర్ణాంబ సమేత అంబికా దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామం సకల శుభాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని మనసారా ప్రార్థిస్తున్నట్లు అంపిలి గ్రామ మహిళలు, గ్రామ ప్రజలు మరియు అమర నాగలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ తెలిపారు.

Post a Comment

1 Comments