ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ఈనెల 23 నుంచి నిరసనలు

పాలకొండ వెబ్ న్యూస్, 13 అక్టోబర్:​ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 23వ తేదీ నుంచి విజయనగరం జోన్ వ్యాప్తంగా 19 బస్సు డిపోలు, జోనల్ వర్క్‌షాప్ వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జోనల్ సెక్రటరీ భాసురు కృష్ణమూర్తి తెలిపారు. గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఒప్పుకున్న మినిట్స్‌ను యాజమాన్యం అమలు చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలకొండ డిపో సమావేశంలో చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మజ్జి సూర్యనారాయణ, ఎస్ నాగరాజు, జె రాములమ్మ, డిపో నాయకులు ఎం వి సాగర్, ఎల్ డి నాయుడు, వారాడ వెంకటరమణ, చింతాడ స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments