పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

పాలకొండ వెబ్ న్యూస్, 14 అక్టోబర్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పాలకొండ నగర పంచాయతీలోని 28 వార్డులకు మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను కమిషనర్ విడుదల చేశారు. ఈ నెల 16న ఓటర్ల జాబితా ప్రదర్శనతో పాటు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 18వ తేదీ వరకు కొనసాగుతుంది. 19న నామినేషన్ల పరిశీలన, 21న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ముగిసిన అనంతరం పోటీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 28న పోలింగ్, అవసరమైతే 29న రీపోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం 30వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.

Post a Comment

0 Comments