పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ల మార్గదర్శకాలు

పాలకొండ వెబ్ న్యూస్: అక్టోబరు 15.. పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమర్పించాల్సిన అవసరమైన పత్రాలు, నిబంధనలను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఫారం-I ని అదనపు ఎన్నికల అధికారి నుండి పొందాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఫారం-II ద్వారా డిక్లరేషన్ సమర్పించాలి. డిపాజిట్ మొత్తంగా రిజర్వేషన్ కేటగిరీకి రూ.1,500, జనరల్ కేటగిరీకి రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థి డిక్లరేషన్, క్రిమినల్ కేసులు, ఆస్తులు-అప్పుల వివరాలు, వయస్సు ధ్రువీకరణ, పిల్లల సంఖ్యకు సంబంధించిన డిక్లరేషన్లను అందించాలి. అలాగే కుల ధ్రువీకరణ పత్రం, నగర పంచాయతీ నుండి బకాయిలు లేవని తెలిపే 'నో డ్యూ సర్టిఫికేట్' తప్పనిసరిగా జతపరచాలని సూచించారు.  

Post a Comment

0 Comments