పాలకొండ నగర పంచాయతీ వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పాలవలస ఇందుమతి ఖరారు

పాలకొండ వెబ్ న్యూస్: అక్టోబరు 15.. ​పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా అనుభవజ్ఞురాలైన పాలవలస ఇందుమతిని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కళావతి, ఇతర నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుమతి గతంలో పాలకొండ ఎంపీపీగా, జెడ్పీటీసీగా పనిచేశారు. ఆమె భర్త పాలవలస రాజశేఖరం రాజ్యసభ సభ్యునిగా, జెడ్పీ ఛైర్మన్‌గా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న నేత. అత్త రుక్మిణమ్మది రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయం. కుమార్తె రెడ్డి శాంతి పాతపట్నం ఎమ్మెల్యేగా చేయగా, కుమారుడు విక్రాంత్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.  రాజకీయ నేపథ్యం ఉన్న ఇందుమతి అభ్యర్థిత్వంతో తూర్పుకాపు వర్గం మద్దతు దక్కుతుందని వైసీపీ భావిస్తోంది.  

Post a Comment

0 Comments