పాలకొండ నగర పంచాయతీ జనసేన అభ్యర్థిగా పల్లా విజయనిర్మల ఖరారు

పాలకొండ వెబ్ న్యూస్.. తేదీ: 18-10-2026..
పాలకొండ స్థానిక ఎన్నికల నేపథ్యంలో పాలకొండ నగర పంచాయతీ జనసేన అభ్యర్థిగా మాజీ చైర్‌పర్సన్ పల్లా విజయనిర్మల పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. శనివారం ఉదయం 11.20 గంటలకు జనసేన కేంద్ర కార్యాలయం అధికారిక జాబితాను విడుదల చేసింది. 2014 నుంచి 2019 వరకు పాలకొండ తొలి చైర్‌పర్సన్‌గా పనిచేసిన విజయనిర్మలకు స్థానికంగా రాజకీయ అనుభవం ఉంది. ఆమె భర్త పల్లా కొండలరావు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు ఆత్మీయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం విజయనిర్మలకు అవకాశం కల్పించింది. 

Post a Comment

0 Comments