పాలకొండ నగరపంచాయతీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా దివంగత నేత పాలవలస రాజశేఖరం సతీమణి పాలవలస ఇందుమతి శనివారం తన నామినేషన్ దాఖలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా వెంటరాగా ఆమె ఈ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైయస్సార్సీపీ పార్వతీపురంమన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, పాతపట్నం మాజీ శాసన సభ్యురాలు రెడ్డి శాంతి, పాలకొండ మాజీ శాసనసభ్యురాలు విశ్వాసరాయి కళావతితోపాటు, పాలకొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు వేలమల మన్మధరావు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కనపాక సూర్యప్రకాశరావు మరియు పలువురు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments