మన పాలకొండ వార్తలు (వెబ్ న్యూస్)
👉 రాష్ట్రానికి మరో 13 వేల మెట్రిక్ టన్నుల యూరియా..
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు . కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 13,050 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని. ఈ యూరియా 20వ తేదీ నాటికి గంగవరం పోర్ట్ చేరుతుందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ—
ఈ కొత్త కేటాయింపుతో రైతులకు యూరియా విషయంలో మరింత సౌలభ్యం కలుగుతుందని,
రాష్ట్రంలో ఎరువుల కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని,
ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
అలాగే ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, వారి అవసరాలు, సమస్యలు పరిష్కరించేందుకు సమగ్ర దృష్టితో పనిచేస్తోందని తెలిపారు. పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం, రైతుల ఆదాయం పెరగడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
0 Comments