మన పాలకొండ వార్తలు (వెబ్ న్యూస్) పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ మండల కేంద్రంలో నియోజకవర్గ ఇంచార్జ్ పడాల భూదేవి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల కమిటీ సమావేశంలో మాజీ మంత్రి, అరకు పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
*.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – పార్టీ బలపర్చడంలో శ్రమించిన, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ పటిష్టత కోసం ప్రతి స్థాయిలోనూ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తేనే పార్టీపై విశ్వాసం పెరుగుతుందని ఆయన అన్నారు.
*.నియోజకవర్గ అభివృద్ధి, గిరిజన సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ బలపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని సూచించారు. అలాగే మండల కమిటీలు గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి పార్టీకి పంపించాల్సిందిగా కోరారు.
0 Comments