అమరావతి :
రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు, టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు కూటమి ప్రభుత్వం కొత్త నియామకాలు చేసింది. దేవాలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యం కోసం ఈ నియామకాలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
దేవాలయాల బోర్డుల ఛైర్మన్ నియామకాలు
1. శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం – పోతుగుంట రమేశ్ నాయుడు
2. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా – కొట్టె సాయి ప్రసాద్
3. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం – వి. సురేంద్ర బాబు (మణి నాయుడు)
4. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి – బొర్రా రాధాకృష్ణ (గాంధీ)
5. శ్రీ వెంకటేశ్వర ఆలయం, వాడపల్లి – ముదునూరి వెంకట్రాజు
టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీల ప్రెసిడెంట్ల నియామకాలు
1. జూబ్లీహిల్స్, హైదరాబాద్ – ఏ.వి. రెడ్డి
2. హిమాయత్‌నగర్, హైదరాబాద్ – నేమూరి శంకర్ గౌడ్
3. బెంగళూరు – వీరాంజనేయులు
4. ఢిల్లీ – ఎదుగుండ్ల సుమంత్ రెడ్డి
5. ముంబై – గౌతమ్ సింగానియా
6. విశాఖపట్నం – వెంకట పట్టాభిరామ్ చోడే
ఈ నియామకాలతో సంబంధిత ఆలయాల కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగుతాయని, భక్తుల సేవలో కొత్త ఉత్సాహం రాబోతుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.
0 Comments