పాలకొండ లో శక్తి టీం అవగాహన కార్యక్రమం

 మన పాలకొండ వార్తలు (వెబ్ న్యూస్)
శక్తి టీం అవగాహన కార్యక్రమం – పాలకొండ
18-09-2025 తేదీన పాలకొండ మండల పరిధిలోని ZPH స్కూల్, హట్కో కాలనీ, పాలకొండ టౌన్ లో శక్తి టీం పాలకొండ ఆధ్వర్యంలో “Awareness Programme on Drugs & Women Safety” కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా విద్యార్థులకు మహిళల భద్రత, శక్తి యాప్ వినియోగం, డ్రగ్స్ దుష్ప్రభావాలు, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ (1930 హెల్ప్‌లైన్), POCSO చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ప్రతి విద్యార్థినికి శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ విధానం, అందులోని 11 ముఖ్య ఫీచర్లు గురించి వివరించారు. ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు శక్తి యాప్ టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా WhatsApp నెంబర్ 91548 74336 కి సంప్రదించవచ్చని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ధైర్యంగా ముందుకు సాగి, సమాజంలో అవగాహన పెంచాలని ప్రేరేపించారు.
శక్తి టీం పాలకొండ తరఫున
మహిళా ఏఎస్ఐ జి. ఝాన్సీ భాయ్
మహిళా హెడ్ కానిస్టేబుల్ సిహెచ్.  ప్రకృతాంబ
కానిస్టేబుల్ ఏ. రాము పాల్గొన్నారు.



Post a Comment

0 Comments