పాలకొండ వెబ్ న్యూస్:పాలకొండ ఆరాధ్యదైవం శ్రీ శ్రీ శ్రీ కోట దుర్గమ్మవారి పాతకాలపు ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే అరుదైన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు మూడు దశాబ్దాల క్రితం నిర్వహించిన అమ్మవారి ఊరేగింపులో తీసిన ఈ చిత్రాలు ఇప్పుడు భక్తులకు దర్శనమిస్తున్నాయి.
అప్పటి కాలంలో అమ్మవారు అద్భుతమైన అలంకారంలో మహా వైభవంగా ఊరేగుతున్న దృశ్యాలు, భక్తుల జనం సందడి ఈ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామస్థులు, పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు కలిసి అమ్మవారి మహోత్సవాలను ఘనంగా నిర్వహించిన తీరు ఈ చిత్రాలలో సజీవంగా ప్రత్యక్షమవుతోంది.
ఈ అరుదైన చిత్రాలను చూసి భక్తులు, “మా చిన్ననాటి జ్ఞాపకాలు, ఆ దేవీ వైభవం మళ్లీ కళ్లముందు ప్రత్యక్షమైంది” అంటూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు.ఫోటోలు అందించినవారు : దివంగత భాసూరు రామారావు గారి కుమారుడు భాసూరు కృష్ణమూర్తి. News by: BSS Prasad
1 Comments
చాలా బాగున్నాయి. మీరు ప్రచురించే శైలి బాగుంది. 🙏🙏🙏
ReplyDelete