పాలకొండ వెబ్ న్యూస్ :
పాలకొండ పట్టణంలోని శ్రీ కోట దుర్గమ్మ ఈ రోజు భక్తుల ముందుకు దుర్గా అవతారంలో దర్శనమిచ్చారు. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి తరలవుతూ, అమ్మవారి స్వరూపాన్ని దర్శించడానికి పెద్ద సంఖ్యలో చేరారు.
ఈ సందర్భంగా ఆలయంలో కుంకుమ పూజలు, నైవేద్యాల కార్యక్రమాలు, మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించ బడ్డాయి. ఆలయ పురోహితులు దార్లపూడి లక్ష్మీ నరసింహ శర్మ పూజలను నిర్వహించారు.
ఈరోజు మంగళవారం కావడంతో, పలు వీధుల్లో భక్తులు ఘటాలు, పూల ముక్కలు చెల్లిస్తూ భక్తి ఉత్సాహం కొనసాగించారు. ముఖ్యంగా నాగవంశం వీధి జంక్షన్ వద్ద గల శ్రీ పురాటాల పోలమాంబ అమ్మవారిని కలువ పూలతో దేదీప్యమానంగా అలంకరించి, ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.ఆలయ పురోహితులు వేమకోటి రవిబాబు పూజలను నిర్వహించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులందరికీ సులభంగా దర్శన అవకాశం కల్పిస్తూ, రద్దీని నియంత్రిస్తూ శాంతియుతంగా నిర్వహణ జరిగేలా చూసుకున్నారు.
షిరిడి సాయి నగర్ లో గల జ్ఞాన సరస్వతి అమ్మవారు దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు
ఈ పవిత్ర అవతారం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు తమ ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆలయ వేదిక మరియు వీధులు శుభాకాంక్షలతో నిండిన వాతావరణంగా మారాయి.
0 Comments