పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం: 40 ఏళ్ళ తర్వాత కలిసిన LVGJ కాలేజీ 1983-85 బ్యాచ్ మిత్రులు

 పాలకొండ వెబ్ న్యూస్ : (30.09.2025)
 పాలకొండ LVGJ కాలేజీకి చెందిన 1983-85 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 40 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక అపూర్వ సమ్మేళనం లో కలసి తమ గత స్మృతులను నెమరు వేసుకుంటూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.

          ఈ స్నేహపూర్వక సమావేశానికి దేశ విదేశాల నుండి మిత్రులు హాజరయ్యారు. ముఖ్యంగా, USA నుండి డీవీడీ ప్రసాద్, బీహార్ నుండి నాగరాజు, గుజరాత్ నుండి పద్మశ్రీ, హైదరాబాద్ నుండి మధుబాబు, ఏలూరు నుండి దుర్గా ప్రసాద్ వంటి వారు సుదూర ప్రాంతాల నుండి విచ్చేశారు.

           స్థానికంగా ఉన్న పూర్వ విద్యార్థులు వేలమల అప్పారావు, రంగాచారి, కందుల కుమార్, ఎచెర్ల మన్మధ రావు, మంచు కరుణాకర్, కె.వి. రమణాచారి తదితరులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.

            సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత కలుసుకున్న మిత్రులు తమ కళాశాల రోజులను, ఆనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సమ్మేళనం పాత స్నేహబంధాలను తిరిగి చిగురింపజేసి, నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది.

Post a Comment

0 Comments