పాలకొండ వెబ్ న్యూస్ (30.09.2025)
పాలకొండ మండలం, వెలగవాడ గ్రామంలోని రచ్చబండ ప్రాంతంలో జనసైనికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించ బడింది. ఈ సమావేశంలో భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఎలా ముందుకు వెళ్లాలో, స్థానిక రాజకీయాలను సక్రమంగా ఏర్పరుచుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి నాయకులు ఎవరు బరిలో నిలుస్తారో సరియైన సమన్వయం ద్వారా సమిష్టిగా కృషి చేయడం ద్వారా గెలుపునకు అవకాశం పెరుగుతుందని సూచించారు.
సమావేశంలో జనసైనికులు, కూటమి నాయకులు, స్థానిక కార్యకర్తలు హాజరై, భవిష్యత్తు ఎన్నికలకు సన్నాహక కార్యక్రమాలను చర్చించారు.
News by : BSS Prasad.

0 Comments