పాలకొండ వెబ్ న్యూస్:01.19.2025
పాలకొండ శ్రీశ్రీశ్రీ కోట దుర్గ అమ్మవారు మహిషాసు మర్దిని అవతారంలో భక్తులకు మహాదివ్య దర్శన మిచ్చారు. సింహవాహనంపై మహిషాసురుడిని సంహరించిన శక్తి స్వరూపిణిగా అమ్మవారు అలంకరించ బడి సర్వలోకాలను కాపాడే దివ్యరూపంలో కనువిందు చేశారు.పౌరాణిక నేపథ్యం:
దేవతలను జయించి, స్వర్గాన్ని ఆక్రమించిన మహిషాసురుడి అణచివేతకు అశక్తులైన దేవతలు తాము కలిగిన శక్తులను సమర్పించగా, దుర్గాదేవి అవతరించారు. సింహవాహనంపై అధిరోహించి, కఠిన యుద్ధంలో మహిషాసురుడిని సంహరించి లోకానికి శాంతి, ధర్మాన్ని తిరిగి స్థాపించారు. అప్పటి నుండి అమ్మవారిని "మహిషాసు మర్దిని" అని ఆరాధించడంప్రారంభమైంది. ఆలయకార్యక్రమాలు: రోజు అమ్మవారు మహిషాసు మర్దిని అలంకారంలో కనువిందు చేయగా, ఉదయం నుంచే ఆలయానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, శక్తి హోమాలు నిర్వహించబడ్డాయి. అమ్మవారి సన్నిధిలో "అయిగిరి నందిని" వంటి శక్తి స్తోత్రాల నినాదాలతో వాతావరణం ఘనంగా మారింది.
0 Comments