పాలనలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్: సాంకేతికతతోనే ప్రజలకు పాలన మరింత చేరువ

 పాలకొండ వెబ్ న్యూస్ : విశాఖ, సెప్టెంబర్ 22: పాలనలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో తెలిపారు. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు పాలనను మరింత చేరువ చేసుకునే అవకాశముందని సీఎం స్పష్టం చేశారు.


 కేంద్ర ఐటీ, సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో సివిల్ సర్వీసెస్ - డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశాలపై చర్చలు జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా ప్రభుత్వ శాఖల పౌర సేవలను సమర్థవంతంగా అందించడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ కీలకమని ముఖ్యమంత్రి తెలిపారు.

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ-సేవ, మీ-సేవ ద్వారా 751 పౌర సేవలను ప్రజలకు వాట్సాప్ ద్వారా అందిస్తూ పాలనను మొబైల్ ఫోన్ల వరకూ తీసుకెళ్లిందని సీఎం తెలిపారు. అలాగే, ఈ-ఫైల్స్, ఈ-కేబినెట్ విధానాలతో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశముందని చెప్పారు.


సాంకేతికత ద్వారా జాతీయ స్థాయిలో అభివృద్ధి

ముఖ్యమంత్రి వెల్లడించినట్టు, ఆంధ్రప్రదేశ్‌లో IBM, TCS, L&T వంటి కంపెనీలతో కలిసి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయబడుతోంది. క్వాంటం కంప్యూటింగ్ సదుపాయాలు ప్రభుత్వ, విద్య, వైద్య రంగాలలో వినియోగంలోకి వచ్చే అవకాశముందని చెప్పారు. ఈ వ్యాలీ ద్వారా ఎకో సిస్టం ఏర్పడుతోందని, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉత్పాదన రంగాలలో వేగవంతమైన మార్పులు జరగుతున్నాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా, సంజీవని ప్రాజెక్ట్ ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులను బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రూపోందిస్తోందని, ఈ వ్యవస్థను త్వరలో దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఆస్కారం ఉందని చెప్పారు. సాంకేతికతతో ప్రజలకు ఈజ్ ఆఫ్ లివింగ్ ను చేరువ చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో డిజిటల్ ఏపీ సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో CS కె. విజయానంద్, కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు





Post a Comment

0 Comments