కార్గిల్ రోడ్డులో గుంతలు పూడ్చిన జనసేన నాయకులు

పాలకొండ వెబ్ న్యూస్: 
పట్టణంలోని వీరఘట్టం రోడ్డు జంక్షన్ వద్ద కార్గిల్ రోడ్డులో ఏర్పడిన గుంతలను జనసేన నాయకులు కొండదాడి రాజేష్ తన సొంత నిధులతో పూడ్చారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ రాంబాబు, సీఐ ఎ.ప్రసాద్, ఎస్‌ఐ ప్రయోగమూర్తి అభినందనలు తెలిపారు. ఎంపీపీ ప్రతినిధి బొమ్మాళి సుధ, ఏఎంసీ డైరెక్టర్ డొంక శివప్రసాద్, జనసేన నాయకులు మిడతన ప్రసాద్, పొగిరి వెంకటరమణ, పొట్నూరు శంకర్రావు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments