నేడే కోటదుర్గమ్మ నిజరూప దర్శనం


పాలకొండ వెబ్ న్యూస్ 
సెప్టెంబర్ 22, పార్వతీపురం మన్యం జిల్లా
పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో నేడు  నిజరూప దర్శనం విశేషంగా నిలిచింది. ఏడాదిలో ఒక్కసారే లభించే ఈ అరుదైన దర్శనాన్ని పొందేందుకు ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
దేవదాయ ధర్మదాయశాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యం కూడా ప్రత్యేకం. స్థల పురాణం ప్రకారం పాలకొండ రాజులు కోటలో శ్రీ దుర్గమ్మను ఆరాధించేవారు. రాజ్య విభేదాలు, యుద్ధాల కారణంగా కోట శిధిలమైపోయింది. అనంతరం 1846లో ఒడిశాకు చెందిన కృష్ణ వల్లభ దాసు స్వప్న దర్శనంతో అమ్మవారి శిలామూర్తులను వెలికి తీసి పూజలు ప్రారంభించారు. ఆ తరువాత ఒడిశా శిల్పులను రప్పించి ప్రస్తుత విగ్రహాన్ని ప్రతిష్టించారు.
అప్పటి నుండి ఆలయం అభివృద్ధి చెందుతూ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా నిలిచింది. కోటలో వెలసినందువల్లే అమ్మవారు కోటదుర్గమ్మ పేరుతో ప్రసిద్ధి చెందారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా కల్పవల్లి గా  పూజలు అందుకుంటోంది.





Post a Comment

0 Comments