పాలకొండ వెబ్ న్యూస్: పట్టణంలోని నక్కలపేట శ్రీ శిర్డి సాయిబాబా సమేత సకల దేవతాలయంలో సోమవారం అష్టాదశ శక్తి పీఠాల సహిత లక్ష్మీ, సరస్వతీతో త్రిపురసుందరి అవతారమూర్తుల ప్రతిష్ఠ నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సాయంత్రం మహిళలచే కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న శక్తి స్వరూపాల విగ్రహాలను ఒక్కచోట ఆరాధించే అవకాశం లభించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూజలు అక్టోబర్ 3 వరకు కొనసాగి, 4వ తేదీ నిమజ్జనం జరగనున్నట్లు ధర్మకర్త పల్లా కొండల రావు, ప్రధాన అర్చకులు శరత్ తెలిపారు.
0 Comments