క్రీడలను ప్రోత్సహించండి: కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి


పార్వతీపురం, సెప్టెంబరు 25: 
జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. ప్రతి విద్యార్థి కనీసం మూడు క్రీడల్లో ప్రావీణ్యం సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజూ ఒక గంట సమయం క్రీడలకు కేటాయించాలని అన్నారు. అండర్-10, 12, 14, 17 విభాగాల వారీగా పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే పంచాయితీ కార్యదర్శుల ద్వారా పది, ఇంటర్ ఫెయిల్ అయిన వారి వివరాలు సేకరించి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదివే అవకాశం కల్పించాలని సూచించారు. పార్వతీపురం, సీతంపేటల్లో పీజీ సెంటర్లు, డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనలు పంపాలని కూడా ఆదేశించారు.

Post a Comment

0 Comments