పాలకొండ వెబ్ న్యూస్ :
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో నేడు ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన బెర్హంపూర్–సూరత్ (ఉద్నా) అమృత్ భారత్ రైలును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే కనెక్టివిటీ కీలకం అని, రైలు–రోడ్డు–జల రవాణా సదుపాయాలు వేగవంతమైన ప్రగతికి దారి తీస్తాయని అన్నారు. శ్రీకాకుళం, పలాసలో హాల్ట్‌లు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
వందే భారత్‌తో పాటు అమృత్ భారత్ రైలు కూడా జిల్లాకు మేలు చేస్తుందని, రైతులు, వ్యాపారులు, మహిళలకు ఈ రైలు ఉపయుక్తం అవుతుందని చెప్పారు. జిల్లాలోని 17 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి జరుగుతోందని, శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కొత్త రూపు సంతరించుకుంటుందని తెలిపారు. శ్రీకాకుళం నుండి హైదరాబాద్, తిరుపతి రైళ్లు నడిపే ప్రణాళికలు ఉన్నాయని, త్వరలో అమలు చేస్తామని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. అనంతరం రైలులో విద్యార్థులతో మాట్లాడి, సౌకర్యాలను పరిశీలించారు.
News by : BSS Prasad

0 Comments