సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్టు : పడాల భూదేవి


పాలకొండ వెబ్ న్యూస్: 29.09.2025 పాలకొండ నియోజకవర్గం, సీతంపేట మండల కేంద్రంలోని టీడీపీ ఇంచార్జ్ కార్యాలయంలో ఇంచార్జ్ పడాల భూదేవి ఆధ్వర్యంలో సోమవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్టు పథకం ద్వారా ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
      పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్, DSCలో 16,500 ఉపాధ్యాయ ఉద్యోగాలు, తల్లికి వందనం, గృహనిర్మాణంలో PVTGలకు అదనపు సహాయం వంటి అనేక పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కృషి ఉందని తెలిపారు.
    ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు చేపట్టి, వివరాలను My TDP Appలో అప్‌లోడ్ చేయాలని భూదేవి సూచించారు.
      ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ సవర్. తోట మొఖాలింగం, AMC డైరెక్టర్ మూర మోహనరావు, మాజీ జడ్పీటీసీ పాలక రాజబాబు, మాజీ ఎంపీటీసీ జయలక్ష్మి, సవర్. కూర్మారావు, మాజీ ఎంపీపీ కుంపి, సిమ్మయ్య, బాలరాజు, సూర్యం, రాము తదితరులు పాల్గొన్నారు.
News by: BSS Prasad



Post a Comment

0 Comments