పాలకొండ వెబ్ న్యూస్ : 28.09.2025 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి డిజిటల్ బుక్ ను పాలకొండలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న కార్యకర్తలకు ఈ డిజిటల్ బుక్ ద్వారా అండగా నిలుస్తున్నట్టు తెలిపారు.
ప్రజాప్రభుత్వం అంటే సంక్షేమం, అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలి. అయితే, ఏపీలో కక్షాసాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వచ్చినప్పటి నుండి అరాచక పాలన కొనసాగుతోందని ఎమ్మెల్సీ విక్రాంత్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దపీట ఉండేలా, కష్టపడి పనిచేసే వారికి పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. ఏవరికైనా అన్యాయం జరిగితే డిజిటల్ బుక్ లో నమోదు చేయమని ఆయన కోరారు. News by : BSS Prasad

0 Comments