పాలకొండ వెబ్ న్యూస్ (శ్రీకాకుళం, అక్టోబర్ 5): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అక్టోబర్ 10న శ్రీకాకుళం అభ్యుదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.ఈ మేళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరగనుంది. ఇందులో ఏసిఎన్ హెల్త్ కేర్, కాన్సెంట్రిక్స్, ఆరబిందో, కియా మోటార్స్, హెట్రో, స్నైడర్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి 18 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నాయని వివరించారు. ఎస్‌ఎస్‌సీ నుండి డిగ్రీ వరకు చదివిన 18-30 ఏళ్ల యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, రిఫరెన్స్ నంబర్, రెజ్యూమే, ఆధార్, విద్యార్హతల ప్రతులు, ఫోటోలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కలెక్టర్ తెలిపారు. వివరాల కోసం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ను 9704960160, 6301045132 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.న్యూస్ బై: BSS Prasad
0 Comments