ఉత్సవానికి డీఎస్పీ ఎం. రాంబాబు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాస బ్యాండ్ పార్టీ పొట్లి వారు మధురమైన సంగీతం అందించగా, సాంప్రదాయ బద్ధంగా బల్ల వేషాలు, కోలాటాలు, గిరిజన నృత్యాలు, సాము గరిడీలు, మంగళ వాయిద్యాలు వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చాయి.
వేద మంత్రాల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ, అర్చకులు మణీల శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ పురవీధులలో ఊరేగింపుగా తల్లిని భక్తులు దర్శించుకున్నారు.ఆలయ ఈవో వి.వి. సూర్యనారాయణ పర్యవేక్షణలో, స్థానిక శాసనసభ్యుడు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో, ఉత్సవ కమిటీ సభ్యులు పల్లా కొండలరావు, గంట సంతోష్ కుమార్, గ్రామ పెద్దలు, భక్తులు, సమన్వయంతో శోభాయాత్ర విజయవంతంగా ముగిసింది.
0 Comments