పాలకొండ వెబ్ న్యూస్ News by BSS Prasad: పాలకొండ, వీరఘట్టం, రేగిడి, బూర్జ మండలాల పరిధిలోని పాఠశాలల పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు నగదు బహుమతులు అందించాలని పాలకొండ శ్రీ సత్యసాయి సేవా సమితి నిర్ణయించింది. సేవా సమితి సభ్యులు, హైకోర్టు అడ్వకేట్ మామిడి వేణుగోపాల్ నాయుడుల ఆధ్వర్యంలో ఈ నాలుగు మండలాల విద్యార్థులకు ప్రత్యేకంగా టెస్ట్ నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తారు. మొదటి బహుమతి రూ.5000, రెండవ బహుమతి రూ.3000, మూడో బహుమతి రూ.2000 చొప్పున అందిస్తారు.పాఠశాలల్లోని మొదటి మూడు ర్యాంకుల విద్యార్థుల పేర్లను త్వరగా పంపాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సేవా సమితి విజ్ఞప్తి చేసింది. నవంబర్ 23 (ఆదివారం)న శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో భాగంగా ఈ బహుమతి ప్రదానం జరుగుతుంది. వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు: 8985922869, 9491568345.
0 Comments