భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హడ్డుబంగి గిరిజన ఆశ్రమం పాఠశాలలో మరణించిన ఎం.కవిత కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మూడవ రోజు జీప్ యాత్ర కొనసాగింది. ఈ యాత్ర పాలకొండ ఆశ్రమం పాఠశాల వద్ద నిరసనగా మారింది. SFI జిల్లా కార్యదర్శి టి. అఖిల్ మాట్లాడుతూ, గిరిజన విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఇటీవల 7 రోజుల్లోనే పి.అంజలి, టీ.కల్పన మృతి చెందగా, జిల్లాలో మొత్తం 14 మంది విద్యార్థులు అనారోగ్యంతో చనిపోయారని తెలిపారు. * ANMలను నియమించాలి, పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. * హాస్టళ్లు చాలీచాలని గదులు, మురుగు కాలువల సమస్య, కలుషిత నీటితో ఉన్నాయని, దీనివల్లే విద్యార్థులు అనారోగ్యాల పాలవుతున్నారని పేర్కొన్నారు. * విద్యార్థికి రోజుకు ₹55 ఖర్చు చేయడం పౌష్టికాహారం అందించడానికి సరిపోదని, మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.మరణించిన 14 మంది విద్యార్థుల కుటుంబాలకు 50 లక్షలు, ఉద్యోగం ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగుతుందని SFI స్పష్టం చేసింది.
0 Comments