పాలకొండ వెబ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 108 ప్రోగ్రాం మేనేజర్ మహమ్మద్ గౌస్ భాషా పాలకొండ ఏరియా హాస్పిటల్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నవజాత శిశు అంబులెన్స్‌లో పరికరాలు, మందులు, రికార్డులను పరిశీలించారు. హాస్పిటల్ సూపరిండెంట్ చిరంజీవి ని కలిసి అత్యవసర సేవలకు 108 వినియోగంపై సూచనలు ఇచ్చారు. జిల్లా మేనేజర్ ఎస్. మన్మధ నాయుడు, డివిజన్ అధికారి గిరిబాబు, సిబ్బంది గణపతి, శ్రీనివాస్, రమణ, మురళి, అనంతరావు పాల్గొన్నారు. News by BSS Prasad


0 Comments