విజయనగరం జోన్ ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం సమర్పించిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్

 పాలకొండ వెబ్ న్యూస్ : విజయనగరం, అక్టోబర్ 15: విజయనగరం జోన్ పరిధిలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారార్థం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కమిటీ తరఫున ఈరోజు ఉదయం 9.30 గంటలకు విజయనగరం జోనల్ ట్రైనింగ్ కాలేజీ సమావేశ మందిరంలో జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎస్. బ్రహ్మానందరెడ్డి కి భాసురు కృష్ణమూర్తి, జోనల్ కార్యదర్శి వినతిపత్రం సమర్పించారు. 

ఈ కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి. భానుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి చి. వెంకటరావు, జోనల్ అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు, జోనల్ కార్యదర్శి బి.కె. మూర్తి, కోశాధికారి కె.ఎస్‌.ఎస్. మూర్తి, నాయకులు నారాయణ, పద్మ, ప్రసాద్, తౌడయ్య, లత, రవికాంత్, యరమునాయుడు తదితరులు పాల్గొన్నారు. జోన్‌లోని ఆరు జిల్లాలు, 19 డిపోలు, జోనల్ వర్క్‌షాప్‌లకు సంబంధించిన సిబ్బంది సమస్యలు, ప్రమోషన్లు, డ్రైవర్-కండక్టర్ ఇబ్బందులు, పనివారం ఒత్తిడి, టైమ్ టేబుల్స్ లోపాలు, కోటర్ అద్దెలు, రెస్ట్ రూములు, మంచినీటి సదుపాయాలు, సీనియార్టీ తేడాలు, రికవరీలు, ఇంక్రిమెంట్లు వంటి అంశాలపై 30 డిమాండ్లతో వినతిపత్రం సమర్పించారు. ఈ సమస్యలన్నింటినీ సమీక్షించి, ఈ నెలాఖరులో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం చూపుతానని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హామీ ఇచ్చారు. News by : BSS Prasad


Post a Comment

0 Comments